HOROSCOPE TODAY ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
రాశి ఫలాలు
By
Published : Aug 29, 2022, 6:14 AM IST
HOROSCOPE TODAY : ఈ రోజు(ఆగస్టు 29) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
అనుకున్నది సాధించే వరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభదాయకం.
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగట్టుగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శుభాన్నిస్తుంది.
మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. పనులు వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మిశ్రమ వాతారణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఒక కీలక వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తుంది.
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలు పొందుతారు. గణపతి మంత్రాన్ని చదివితే మంచిది.
శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
ఆశించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. సమయ పాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం. ప్రయాణాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
తోటివారి సహాయ సహకారాలున్నాయి. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కుల దైవారాధన శుభప్రదం.
అనుకూల సమయం. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.