తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 3 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశి ఫలాలు

By

Published : Jul 3, 2021, 5:18 AM IST

Updated : Jul 3, 2021, 6:57 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

మీ ప్రతిభకు,పనితీరుకు అధికారులు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.

వృషభం

ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

మిథునం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసే వారున్నారు. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

సింహం

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆర్థికంగా అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

కన్య

మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాలతో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవాలి.

తుల

మానసికంగా దృఢంగా ఉంటారు. క్షీరనీర న్యాయం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

ధనస్సు

చేసే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.

మకరం

మీ మీ రంగాల్లో చక్కటి ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవం ధ్యానం శుభప్రదం.

కుంభం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసే వారున్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మీనం

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.

Last Updated : Jul 3, 2021, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details