తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గెలిచిన భాజపా నేతలను రాళ్లతో కొట్టండి' - మోర్వా హాడాఫ్​ కి ఉపఎన్నికలు

గుజరాత్​లోని మోర్వా హడాఫ్​ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భాజపా నాయకుల ఇళ్లపై దాడులు చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Gujarat Cong MLA asks party workers to pelt stones at BJP candidates' homes
'గెలిచిన భాజపా నేతలను రాళ్లతో కొట్టండి'

By

Published : Mar 24, 2021, 10:38 AM IST

గుజరాత్​లోని మోర్వా హాడాఫ్​ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రికా బరియా స్థానికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భాజపా అభ్యర్థుల ఇళ్లపై రాళ్లు రువ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గెలిచిన అభ్యర్థులు ఈవీఎంలను ఉపయోగించి బోగస్​ ఓట్లతో గెలిచినట్లు ఆరోపించారు చంద్రిక. ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎన్నికల్లో మద్యాన్ని విచ్చలవిడిగా పంచారని తెలిపారు. అడ్డదార్లు తొక్కి గెలిచిన వారి ఇళ్లపై రాళ్లు రువ్వి సరైన సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా ఇరుపార్టీల మధ్య వివాదానికి దారి తీశాయి.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్​ విసిరారు చంద్రిక. తనను ఓడించాలంటే ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని తెలిపారు.

'పోలీసు వ్యవస్థ దుర్వినియోగం'

గుజరాత్​లో భాజపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు అమిత్​ చౌడా ఆరోపించారు. భారీగా అవినీతికి పాల్పడిన కమలదళం ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆ డబ్బును ఖర్చు చేస్తోందన్నారు. ఇందుకు సాయంగా పోలీసులను, అధికారులను వారి స్వలాభం కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే వ్యూహాలపై నాయకులతో చర్చించారు అమిత్​.

కాంగ్రెస్​ ఎమ్మెల్యే భూపేంద్ర కాంత్​ మరణంతో మోర్వా హడాఫ్​ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఏప్రిల్ 17 న ఈ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది.

ఇదీ చూడండి: పరమ్​వీర్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details