తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సైన్యంలో చేరేలా యువతకు అవగాహన కల్పించాలి'

ఆర్మీలో అన్ని ప్రాంతాల నుంచి సమానమైన స్థాయిలో సైనికులు లేరని సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవాణే అన్నారు. ఆర్మీని కెరీర్​గా ఎంచుకునేందుకు యువతకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని బాలికల సైనిక పాఠశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

M M Naravane of indian army
youth career as army

By

Published : Jul 14, 2021, 11:58 AM IST

సాయుధ దళాల్లో కొన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం తక్కువగా ఉందని సైన్యాధిపతి ఎంఎం నరవాణే అన్నారు. ఆర్మీని ఒక కెరీర్​గా ఎంచుకునేలా యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు. మహారాష్ట్రలోని బాలికల సైనిక పాఠశాల 'రాణి లక్ష్మీభాయి ములించి సైనిక్​ శాలా' సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"సైన్యంలో లింగ సమానత్వం, మహిళా సాధికారతను కట్టుబడి ఉన్నాం. దేశానికి సేవ చేయడానికి సాయుధ దళాల్లో ఆడ, మగ అనే తేడాలే లేవు. అందరికి సమాన అవకాశాలున్నాయి. బంగారు భవిష్యత్​ను నిర్మించుకోవడానికి సైన్యంలో అపారమైన అవకాశాలున్నాయి. మహిళా అధికారులు సైతం ఆర్మీలో మెరుగైన సేవలు అధిస్తున్నారు. భారత ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని సైన్యం ప్రతిబింబిస్తోంది. అన్ని ప్రాంతాలవారి కలయికతో ఆర్మీ ఓ మిని ఇండియాలా ఉంది."

-ఎంఎం నరవాణే, సైన్యాధిపతి

ఆర్మీలో అన్ని ప్రాంతాల నుంచి సమానమైన స్థాయిలో సైనికులు లేరని నరవాణే అన్నారు. దేశ ఉత్తర ప్రాంతాలు జనాభాలో 14 శాతాన్ని కలిగి ఉంటే.. సైన్యంలో 45 శాతం ఉన్నారని తెలిపారు. దేశ పశ్చిమ ప్రాంతాలు కూడా 14 శాతం జనాభా ఉన్నప్పటికీ.. సైన్యంలో మాత్రం 8 శాతం మందే ఉన్నారని పేర్కొన్నారు. సాయుధ దళాల్లో చేరికపై యువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇవీ చదవండి:జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో డ్రోన్​ కలకలం- బలగాలు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details