తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైబర్​ నేరాల కట్టడిలో పౌరుల భాగస్వామ్యం - సైబర్​ వాలంటీరు

సైబర్​ నేరాలను కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సామాన్య ప్రజలను కూడా ఈ నేరాలను ఆపేందుకు సిద్ధం చేయడానికి కృషి చేస్తోంది. ఇందుకుగాను సైబర్​ క్రైమ్​ వలంటీర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు 'ఇండియన్​ సైబర్​ క్రైమ్​ కోఆర్డినేషన్​ సెంటర్​' అనే ప్రాజెక్టును చేపడుతుంది.

Govt asks people to register as cyber crime volunteers to check unlawful online content
సైబర్​ నేరాల కట్టడిలో పౌరులు భాగస్వామ్యం

By

Published : Feb 10, 2021, 9:28 AM IST

సైబర్​ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు 'సైబర్​ క్రైమ్​ వలంటీర్లు'గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, చిన్నారులు, మహిళలను కించపరచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను అడ్డుకోవడంలో సాయపడాలని కోరింది. ఈ మేరకు 'ఇండియన్​ సైబర్​ క్రైమ్​ కోఅర్డినేషన్​ సెంటర్​'(ఐ4సీ) అనే ప్రాజెక్టు కింద దీన్ని చేపడుతున్నారు. దీన్ని గతవారం జమ్ముకశ్మీర్​లో ప్రారంభించారు. అక్కడ.. వలంటీర్లుగా నమోదుకావాలని సూచిస్తూ పౌరులకు పోలీసులు ఒక సర్య్కులర్​ జారీ చేశారు.

  • భారత పౌరులెవరైనా వలంటీరు ప్రాజెక్టులో పాలు పంచుకోవచ్చు.
  • చట్టవిరుద్ధ అంశాలను గుర్తించే సైబర్​ వలంటీరు, సైబర్​ అవగాహన ప్రచారకుడు, సైబర్​ నిపుణుడు అనే మూడు విభాగాల్లో ఏదో ఒక దానిలో నమోదు కావొచ్చు.
  • మొదటి విభాగంలోని వలంటీర్లు.. అశ్లీల దృశ్యాల్లో చిన్నారులను వినియోగించడం, అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఉగ్రవాదం, అతివాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో సాయపడతారు.
  • రెండో విభాగంలోనివారు.. మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు, గ్రామీణులు వంటి వారిని సైబర్​ నేరాల గురించి అప్రమత్తం చేస్తారు.
  • మూడో విభాగంలోని వలంటీర్లు.. సైబర్​ నేరాల్లోని నిర్ధిష్ట విభాగాలు, ఫోరెన్సిక్స్​, నెట్​వర్క్​ ఫోరెన్సిక్స్​, మాల్​ వేర్​ విశ్లేషణ, మెమరీ విశ్లేషణ, క్రిప్టోగ్రఫీ వంటి అంశాల్లో సేవలు అందిస్తారు.
  • మొదటి విభాగంలోని వారికి పూర్వాపరాల తనిఖీ ఉండదు. రెండు మూడు విభాగాల వారికి మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'కేవైసీ' నిబంధనల ద్వారా పరిశీలన జరుపుతాయి.

ఏకతాటిపైకి తెచ్చేందుకే..

సైబర్​ నేరాల నివారణ, ముందే పసిగట్టడం, దర్యాప్తు, విచారణ వంటి అంశాల కోసం విద్యావేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు వర్గాలతో ఒక వేదికను ఏర్పాటు చేయడమే 'ఐ4సీ' ఉద్దేశమని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, వలంటీర్లకు ఎలాంటి పారితోషికం ఉండదని చెప్పింది. ఈ హోదాను వాణిజ్యపరమైన లబ్ధి కోసం కూడా ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో తాము పాలుపంచుకున్నట్లు వలంటీర్లు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదని స్పష్టం చేసింది. తమ విధులకు సంబంధించి పూర్తి గోప్యత పాటించాలంది.

ఇదీ చూడండి:ఆన్‌లైన్‌ మాయగాళ్ల అరాచకం!

ABOUT THE AUTHOR

...view details