విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
Published : Nov 23, 2023, 4:30 PM IST
|Updated : Nov 23, 2023, 5:00 PM IST
16:24 November 23
మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులకు స్థలం కేటాయింపు
Government issued orders allotting buildings in Visakha: విశాఖలో పలు శాఖలకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల కార్యాలయ, విడిది అవసరాలకు 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా విభాగాలకు క్యాంపు కార్యాలయాల స్థలాలు అందుబాటులో లేకపోతే విశాఖలోని మిలీనియం టవర్లు, సమీపంలోని ఏ, బి బ్లాక్ భవనాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఇంధన శాఖలు మినహా మిగతా 35 శాఖలకు కార్యాలయల ఏర్పాటుకు భవనాలు సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్ర విశ్వ విద్యాలయం, రుషికొండ, చినగదిలి, ఎండాడ, హనుమంత్వాక తదితర ప్రాంతాల్లో భవనాల కేటాయింపు అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశాన్ని ప్రభుత్వం జీవోలో వెల్లడించలేదు.