food poisoning: కలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిన ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ జ్యూస్ షాప్లో షవర్మా తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఆ షాపు ట్యూషన్ కేంద్రానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.
కరివళ్లూర్కు చెందిన దేవానంద (16).. కన్హాన్ గడ్లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. జ్యూస్ షాప్పై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన మరో 18 మంది విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.
"ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నాం. చెరువతుర్ పీహెచ్సీ, నీలేశ్వరమ్ తాలూక ఆసుపత్రికి సమీపంలోని వైద్యులు, మెడికల్ ఇన్స్టిట్యూట్స్కు సమాచారం అందించాం. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి అక్కడే చికిత్స అందించటం సహా తీవ్రంగా అస్వస్థతకు గురైన వారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నాం. "