తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీడీ కేసులో కొత్త ట్విస్ట్​.. నిజం ఒప్పుకున్న జార్ఖిహోళి!

సీడీ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి జార్ఖిహోళి కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియోలో ఉంది తానే అంటూ సిట్​ విచారణలో భాగంగా వెల్లడించారు. అయితే తాను మహిళపై అత్యాచారానికి పాల్పడలేదని పేర్కొన్నారు.

cd case ramesh jarkiholi, కర్ణాటక సీడీ కేసు
ఆ వీడియోలో ఉన్నది నేనే అన్న మంత్రి

By

Published : May 25, 2021, 11:44 AM IST

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళి సీడీ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్​ విచారణకు హాజరైన నిందితుడు జార్ఖిహోళి ఆ వీడియోలో మహిళతో ఉన్నది తానే అని వెల్లడించారు. మొదట ఈ ఆరోపణలను ఖండించిన జార్ఖిహోళి.. ఇప్పుడు సిట్​ విచారణలో భాగంగా అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సిట్​ విచారణలో ఇలా..

"సీడీలోని వీడియోలో ఆ మహిళతో ఉన్నది నేనే. ఆమె నాకు పరిచయస్తురాలు. ఓ ప్రాజెక్ట్​ పనిమీద తను నా వద్దకు వచ్చింది. ఆ తర్వాత నా ఫోన్​ నెంబరు తీసుకుని తరచూ కాల్​ చేసేది. ఆ రోజు అర్జెంటుగా నా అపార్ట్​మెంట్​కు రమ్మని పిలిచాను. ఆమె అనుమతితో అదంతా చేశాను. అత్యాచారానికి పాల్పడలేదు."

-రమేశ్​ జార్ఖిహోళి, నిందితుడు

రాజకీయ లబ్ధికోసమే కొందరు తన ఫొటోతో ఈ సీడీ చేశారని జార్ఖిహోళి ఇదివరకు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఇదీ చదవండి :కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులపై దాడి

ABOUT THE AUTHOR

...view details