తమిళనాడు విల్లుపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు పిల్లలను చంపి, భార్యాభర్తలు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను మోహన్(38), విమలశ్రీ(32), రాజశ్రీ(8), నిత్యశ్రీ(7), శివబాలన్(5)గా అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య - family suicide in Tamilnadu
తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక ఆ కుటుంబం ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
'వలవనూర్ పుడుపాలయంకు చెందిన మోహన్ కార్పెంటర్ పని చేసేవాడు. కరోనా కారణంగా పని లేకుండా పోయింది. అందుకే మోహన్.. ఇంటిని తాకట్టు పెట్టి రూ.50 లక్షలు అప్పు చేసి ఓ వ్యాపారం ప్రారంభించాడు. అయితే లాభాలు రాకపోవడం వల్ల వడ్డీ కట్టలేక.. ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యాడు. దీంతో కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు' అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.