నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు నేడు తేలిపోనున్నాయి.
మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకుగాను 2.7 లక్షల పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళ పోరు...
తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకే కూటమి మధ్య ద్విముఖపోరు నడిచింది. మళ్లీ తామే అధికారాన్ని చేపడతామని ఏఐఏడీఎంకే ధీమాగా ఉండగా.. మరోవైపు.. ఈసారి తమిళ ఓటర్లు తమకే పట్టం కడతారని డీఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కమలహాసన్, దినకరన్ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి:తమిళ పోరు: కౌంటింగ్‌కు వేళాయెరా
234 సీట్లకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.
తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. అధికార పీఠాన్ని అధిరోహించనుందని వెల్లడించాయి.
బంగాల్ దంగల్..
294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో సాగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది.. సర్వత్రా ఆసక్తిగా మారింది. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్ దేశం సాక్ష్యంగా నిలిచింది.
ఇదీ చదవండి:బంగాల్ దంగల్‌లో విజేత ఎవరు?
బంగాల్లో ఏ పార్టీ అయినా.. అధికారాన్ని చేపట్టేందుకు 148 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
బంగాల్ గడ్డపై టీఎంసీ మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేరళ సమరం..