Drugs Seized in Delhi: దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తుండగా.. వాటిని పట్టుకున్నారు.
విమానాశ్రయంలో రూ.7.43 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత - దిల్లీలో మాదకద్రవ్యాలు
Drugs Seized in Delhi: విదేశాల నుంచి భారత్‌కు మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1,060 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

heroin Seized
Heroin in airport: ఉగాండా నుంచి భారత్ చేరుకున్న ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించగా.. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతని బ్యాగులో దుస్తుల్లో ఉంచిన 1,060 గ్రాములున్న 107 హెరాయిన్ క్యాప్యూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.43 కోట్ల ఉంటుందని అంచనా వేశారు. సదరు వ్యక్తిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:షాకింగ్ . కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్