సాధారణంగా పిల్లలు పుట్టిన మూడు నెలలకు వారికి బారసాల చేసి శాస్త్రోక్తంగా నామకరణం చేస్తారు. తమకు చిరకాలం గుర్తుండిపోయే ఆ వేడుకను ఉన్నంతలోనే ఘనంగా నిర్వహించాలనుకుంటారు. ఇది సహజమే. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామస్థులు.. తమ కుక్కపిల్లకు బారసాల నిర్వహించారు. డీజే మ్యూజిక్, మహిళల లాలి పాటల మధ్య జరిగిన ఈ వేడుక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కుక్క పిల్లకు బారసాల.. లాలిపాటలు పాడుతూ వేడుక.. పేరేం పెట్టారంటే?
ఓ ఊరిలోని వారంతా కలిసి కుక్క పిల్లకు బారసాల నిర్వహించారు. కుక్కకు పేరు పెట్టి.. వేడుకను ఘనంగా నిర్వహించింది. వివరాల్లోకి వెళ్తే..
వివరాల్లోకి వెళ్తే...
కిన్హి చంద్రపుర్ జిల్లాలోని బ్రహ్మపురి తాలూకాలో ఓ ఆడకుక్కను ఆ గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటీవలే ఆ కుక్క పది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఓ కుక్కపిల్లకు నామకరణం చేద్దామని నిర్ణయించుకున్న గ్రామస్థులు స్థానిక హనుమాన్ మందిరంలో ఓ పెద్ద వేడుకను నిర్వహించారు. అంతే కాకుండా మహిళలంతా ఒక్కచోట చేరి ఆ కుక్క పిల్లను ఊయలలో వేసి ఊపారు. లాలి పాటలు పాడుతూ కుక్కపిల్లలను బుజ్జగించారు. ఆ శునకానికి దత్తాత్రేయ అని నామకరణం చేశారు. అదే గ్రామానికి చెందిన అనుసాయా యాదయ్ అనే ఓ మహిళ ఆ కుక్క పిల్లల బాధ్యత తీసుకున్నారు.