తెలంగాణ

telangana

By

Published : May 22, 2021, 3:11 PM IST

Updated : May 22, 2021, 3:30 PM IST

ETV Bharat / bharat

మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా 'యాస్​'

దేశంలో మరో తుపాను 'యాస్​' సంభవించనుంది. మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా- బంగాల్ మధ్య తీరాలను దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Cyclon
తుపాను

తౌక్టేను మరవక ముందే దేశంలో మరో తుపాను కలవరపెడుతోంది. 'యాస్​' తుపాను మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా, బంగాల్ తీరాలను దాటనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది.

మే 23 నాటికి అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణించనుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 24కు తుపానుగా పరిణామం చెంది ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని వెల్లడించింది. తౌక్టే తుపాను ఇప్పటికే పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసింది. గుజరాత్​లో బీభత్సం సృష్టించింది.

ఇదీ చదవండి: ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం

Last Updated : May 22, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details