నాసా నిర్వహించిన 27వ హ్యూమన్ ఎక్స్‌ప్లొరేషన్ రోవర్ ఛాలెంజ్ పోటీల్లో ఒడిశాకు చెందిన 'నవోన్మేష్ ప్రసార్ స్టూడెంట్స్ ఆస్ట్రానమీ టీమ్ (నాప్సాట్)' మూడో స్థానంలో నిలిచింది. బృందానికి నేతృత్వం వహించిన రిషికేష్ అమిత్ నాయక్ ఈ వివరాలను శనివారం తెలిపారు. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి అండర్-19 విభాగంలో 20 బృందాలు పాల్గొన్నాయని, తొలి రెండు స్థానాల్లో అమెరికాకు చెందిన బృందాలున్నాయని తెలిపారు.
ఒడిశా విద్యార్థుల సత్తా- నాసా పోటీల్లో మూడో స్థానం
నాసా హ్యూమన్ ఎక్స్‌ప్లొరేషన్ రోవర్ ఛాలెంజ్ పోటీల్లో ఒడిశా విద్యార్థులు ప్రతిభ చాటారు. వారు రూపొందించిన రోవర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మూడో స్థానం దక్కింది.
నాప్సాట్ వ్యవస్థాపకులు అనిల్ ప్రధాన్, వైశాలి శర్మ, పది మంది విద్యార్థుల బృందంతో కలిసి రోవర్‌ను రూపొందించారు. దాన్ని వివిధ ఉపరితలాలపై పరీక్షించి అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాసా ప్రతినిధులకు ఆన్‌లైన్‌లో పంపారు. వాటన్నింటినీ పరిశీలించిన వారు హైస్కూల్ విభాగంలో నాప్సాట్ బృందానికి మూడో స్థానం ప్రకటించారు. ఈ బృందానికి ఉత్తమ వీడియోగ్రఫీ అవార్డుకు కూడా ఎంపిక చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్రంలోని ప్రముఖులు ఈ బృందానికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:నాసా పోటీలకు ఒడిశా విద్యార్థుల 'రోవర్'