తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట కరోనా తగ్గుముఖం- కొత్తగా 25 వేల కేసులు

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడులో 25 వేల కేసులు వెలుగుచూశాయి. కేరళలో 19 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలో క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త పెరిగింది.

corona cases in states
కొవిడ్​ కేసులు

By

Published : Jun 2, 2021, 10:28 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 25,317 కేసులు నమోదయ్యాయి. 483 మంది ప్రాణాలు కోల్పోయారు. 32,263 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 576 కేసులు వెలుగులోకి వచ్చాయి. 103 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో 15,169 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 285 మంది చనిపోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 1,500 మందికి కరోనా సోకగా.. మరో 115 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో 19,661 కేసులు నమోదయ్యాయి. 213 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 16,387 కేసులు బయటపడ్డాయి. 463 మంది మరణించారు.
  • బంగాల్​లో 8,923 కేసులు వెలుగుచూశాయి. 135 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో 1,333 మందికి పాజిటివ్​ వచ్చింది. 18 మంది చనిపోయారు.
  • హరియాణాలో 1,171 కేసులు బయటపడ్డాయి. 78 మంది వైరస్​ ధాటికి బలయ్యారు.
  • పంజాబ్​లో 2,281 మందికి కరోనా​ పాజిటివ్​గా తేలింది. మరో 99 మంది వైరస్​ బారినపడి మరణించారు.
  • రాజస్థాన్​లో 1,276 కొత్త కేసులు వెలుగు చూడగా.. మరో 65 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:ఎన్ని టీకాలు కొన్నారో చెప్పండి: సుప్రీం

ఇదీ చూడండి:Corona Death: గంటకు 165 మంది బలి!

ABOUT THE AUTHOR

...view details