corbevax vaccine india: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ రూపొందించిన కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. అయితే గతంలో కొవిషీల్డ్ కానీ, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ.. ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్ ఘనత సాధించింది. డీసీజీఐ నిర్ణయంపై బయోలాజికల్-ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు.
" ఈ ఆమోదం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. దేశంలోని బూస్టర్ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించింది’ అని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్ ప్రికాషనరీ డోసు పొందవచ్చు."
- మహిమ దాట్ల, బయోలాజికల్-ఇ మేనేజింగ్ డైరెక్టర్