తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కఠినంగా లాక్​డౌన్​ అమలు- బోసిపోయిన రోడ్లు

కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ బాటపట్టాయి. ఆంక్షల ఉల్లంఘనలపై కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ, ఉత్తర్​ప్రదేశ్​లలో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి.

weekend lockdown
వారాంతపు లాక్​డౌన్

By

Published : Aug 1, 2021, 11:48 AM IST

కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. వైరస్​ను అదుపుచేయడానికి కేరళలో వారాంతపు లాక్​డౌన్​ విధించారు. దీంతో తిరువనంతపురంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

వారాంతపు లాక్​డౌన్​
నిర్మానుష్యంగా రోడ్లు

కేవలం నిత్యవసరాల దుకాణాలను మాత్రమే తెరిచి ఉంచారు.

కళతప్పిన రోడ్లు
బోసిపోయిన రహదారులు
వారాంతపు లాక్​డౌన్

కొచ్చిలో జన సంచారం లేక రోడ్లు వెలవెలబోతున్నాయి.

షాపులు బంద్
లాక్​డౌన్ ప్రభావం

తగ్గని ఉద్ధృతి..

కేరళలో శనివారం కొత్తగా 20,624 కరోనా కేసులు బయటపడ్డాయి. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 50శాతం ఈ రాష్ట్రంలోనివే. మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా నిబంధనలను పాటించాలని ఆ రాష్ట్రాన్ని ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్​ ఉద్ధృతికి దారి తీసే 'సూపర్​ స్ప్రెడర్​ ఈవెంట్లు'.. కేరళలో ఇటీవల కనిపించాయని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్ లేఖ రాశారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందం వెళ్లింది.

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. దేశవ్యాప్తంగా వైరస్‌ విలయతాండవం చేసిన సమయంలోనూ కేరళ ప్రభుత్వం మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో కేరళ తీసుకుంటున్న వైరస్‌ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.

మూడో దశ కాదు: కేరళ ప్రభుత్వం

కరోనా కేసులను కట్టడి చేసేందు కోసం ప్రతిఒక్క పాజిటివ్​ కేసును గుర్తించాలనుకుంటున్నట్లు చెప్పారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు.. మూడో దశ ముప్పు కాదని స్పష్టం చేశారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకోసమే పరీక్షల సంఖ్యను పెంచామని, అందుకే పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ఆర్​టీపీసీఆర్​ తప్పనిసరి..

ఇక కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారు ఆగస్టు 5 నుంచి తప్పనిసరిగా ఆర్​టీపీసీఆర్​ రిపోర్ట్​ సమర్పించాలని ఆదేశించారు తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎంఏ సుబ్రమణ్యం.

యూపీలోనూ..

ఖాళీగా రహదారులు

కొవిడ్​ వ్యాప్తిని అరికట్టడానికి ఉత్తర్​ప్రదేశ్​లోనూ వారాంతపు లక్​డౌన్​ కొనసాగుతోంది. మేరఠ్​లో వీధులన్నీ బోసిపోయాయి.

ఖాళీగా రోడ్లు
మూతపడ్డ దుకాణాలు

నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మేరఠ్​లో

తెరుచుకోనున్న తరగతి గది..

ఇక ఉత్తరాఖండ్​లో సోమవారం నుంచి పాఠశాలలు తెరవనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అర్వింద్ పాండే తెలిపారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బోధన జరగనుంది. అన్ని పాఠశాలలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విద్యార్థులు ఎక్కువగా ఉన్న తరగతుల్లో విడతల వారీగా తరగతులు నిర్వహించాలని మంత్రి స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:'అదుపు చేయకుంటే మరింత ప్రమాదకర వేరియంట్లు'

ABOUT THE AUTHOR

...view details