పంజాబ్‌లోని జలాలాబాద్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై దాడి జరిగింది. స్థానికుల ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి సుఖ్బీర్ సింగ్ నేతృత్వంలో అకాలీదళ్ అభ్యర్థి వెళ్లిన నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
శిరోమణి అకాలీదళ్ అధినేత వాహనంపై దాడి - Clashes between Akali dal and Congress
పంజాబ్‌లో కాంగ్రెస్-శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై దాడి చేశారు కొందరు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

శిరోమణి అకాలీదళ్ అధినేత వాహనంపై దాడి
శిరోమణి అకాలీదళ్ అధినేత వాహనంపై దాడి
ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని దాడికి యత్నించారు. ఈ ఘటనలో సుఖ్బీర్ సింగ్ కారు దెబ్బతింది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.