శ్రావణమాసం(Shravan month) చివరిరోజున తన భర్త చికెన్ తిన్నాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లో జరిగింది.
ఇదీ జరిగింది..
కరౌదా గ్రామానికి చెందిన రామ్ జనమ్ సింహ్ ఆగస్టు 22న రక్షాబంధన్(Raksha Bandhan 2021) సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్ తిన్నాడు. అయితే.. అది శ్రావణ మాసం చివరిరోజు. శ్రావణ మాసంలో(Shravan month 2021) చాలా మంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ, రామ్ జనమ్ చికెన్ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.