దిల్లీ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులకూ రక్షణ లేకుండా (Attack on Police today) పోయింది. తనిఖీల కోసం ఆపిన వాహనదారులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా, రోహిణి ఏరియాలోని కేఎన్ కాట్జు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన జరిగింది. సెక్టార్ 16లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి (Attack on Police today) జరిగింది.
పిటంపురా ప్రాంతానికి చెందిన పీయూష్ బన్సల్ అనే వ్యక్తి.. కారులో రోహిణి ప్రాంతం మీదుగా వెళ్తున్నాడు. సీటు బెల్టు ధరించకుండా, సిగరెట్ తాగుతూ కారులో ప్రయాణిస్తున్నాడు. అతడిని అడ్డుకున్న పోలీసులు.. ఛలాన్ కట్టాలని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో పీయూష్ వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీస్ దలేల్ సింగ్‌పై దాడి (attack on delhi police) చేశాడు. ఈ ఘటనలో దలేల్ సింగ్ బొటనవేలికి గాయమైంది.