ఓ యువ పాత్రికేయుడిని దుండగులు అపహరించి దారుణంగా హత్య చేశారు. సజీవ దహనం చేసి మృతదేహాన్ని పెట్టెలో పెట్టి ముళ్ల పొదల్లో పడేశారు. ఈ దారుణ సంఘటన బిహార్ మధుబనీ జిల్లాలో జరిగింది.
ఆ వార్తలు రాసినందుకు...
బెనిపట్టికి చెందిన ఆర్టీఐ కార్యకర్త, పాత్రికేయుడు బుద్ధీనాథ్ ఝా అలియాస్.. అవినాశ్ ఝా ఓ యూట్యూబ్ ఛానల్లో కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తాను జీవించి ఉండే వరకు పోరాడతానని 24 రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు ఝా. మెడికల్ మాఫియాపై పలు వార్తలు రాశారు. ఆయన వార్తల వల్ల 10 ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 9వ తేదీన బెనిపట్టిలోని తన షాప్ నుంచి కనిపించకుండా పోయారు.
అతని సోదరుడి ఫిర్యాదులో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు బెనిపట్టి పోలీసు. ఝా కనిపించకుండా పోయారనే వార్త.. స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పుట్టుమచ్చలు, ఉంగరాల ఆధారంగా మృతుడు అవినాశేనని పోలీసులు నిర్ధరించారు.
ఆందోళనలు..