దేవభూమి ఉత్తరాఖండ్లో కార్చిచ్చు చెలరేగి వందలాది హెక్టార్ల భూమి కాలి బూడిదవుతోంది. రాష్ట్రంలో పలు చోట్ల అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మే 23 నుంచి దావానలం తీవ్రత అధికమైందని చెబుతున్నారు. కార్చిచ్చు ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.
900 హెక్టార్లకు పైగా..
ఈ ఏడాదిలో కుమావున్, గర్హ్వాల్ ప్రాంతాల్లో 925 హెక్టార్ల మేర భూమి దావానలం వల్ల ప్రభావితమైందని రాష్ట్ర ప్రధాన అటవీ అధికారి పీకే సింగ్ తెలిపారు. వందలాది జంతువులు, వేలాది చెట్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.