" చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏటా ఇక్కడికి వస్తాను. హోలీకి తప్పకుండా హాజరువుతా. చాలా దూరం నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఫిబ్రవరి 10న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 రోజుల పాటు హోలీ వేడుకలు నిర్వహిస్తారు. ఈ రోజు లడ్డు మార్ హోళీ. నిన్న లట్మార్ హోళీ. నందగామ్ నుంచి గోపాలకులు ఇక్కడికి వచ్చి హోలీలో పాల్గొంటారు. "- భక్తురాలు
బర్సానాలోని రాధారాణి మందిరాన్ని సాయంత్రం నాలుగు గంటలకు తెరిచారు. ఆలయం తెరుచుకోగానే లడ్డూమార్ హోలీ ఆడారు. ఆ సమయంలో భజనలు, కీర్తనలు, కళాకారుల ఆటపాటలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఒకరిపై ఒకరుఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు.
వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు.