అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష్మీని గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది యూఎన్డీపీ. ఈ అవకాశాన్ని నటన, ఆటలు, సంగీతం వంటి రంగాల్లోని ప్రముఖులకు ఇస్తుంటారు. గతంలో స్పానిష్ నటుడు ఆంటోనియో, సంగీత దర్శకుడు బాబ్ వెయిర్ ఈ ఘనత సాధించారు.
'మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా... ప్రపంచవ్యాప్తంగా నారిపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు నిర్ణయం తీసుకోవాలి. శాంతి, సమానత్వ స్థాపనకు మరింత మంది ముందుకు రావాలి'. -యూఎన్డీపీ నూతన గుడ్‌విల్ అంబాసిడర్, పద్మలక్ష్మి
పేద, ధనిక దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అసమానత్వ పోకడలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తానని ప్రకటించారు. చాలా దేశాలు పేదరికంపై చర్యలు తీసుకుంటున్నా.. అసమానత్వం పెద్ద సమస్యగా మారుతోందని వ్యాఖ్యానించారు. లింగ, జాతి, వయసు, తెగ వంటి భేదాలు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సమాజంలో మైనార్టీలు ఈ విషయంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అనుభవాలు...
న్యాయమూర్తి, వ్యాఖ్యాత, రచయితగానూ లక్ష్మికి అనుభవముంది. బ్రావో టెలివిజన్ ఎమ్మీ అవార్డుల్లో టాప్ షెఫ్‌గా అవార్డును అందుకున్నారు. న్యూయర్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయితగా, ఎండోమెటిరియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సహా వ్యవస్థాపకురాలిగా పేరుంది. మసాచుసెట్స్‌లో పట్టభద్రురాలైన ఈమె... వలసదారుల హక్కులు కాపాడేందుకు అంబాసిడర్‌గానూ పనిచేశారు.