తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది రాజకీయ ధీరుడికి X ఆధునిక చాణక్యుడికి మధ్య ఆట'

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం అనంతర నాటకీయ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​తో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు అమిత్​షా, ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ల మధ్య ఆట మొదలైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

'ఇది రాజకీయ ధీరుడికి X ఆధునిక చాణక్యుడికి మధ్య ఆట'

By

Published : Nov 25, 2019, 9:43 AM IST

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు కొనసాగుతోన్న నేపథ్యంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్​సీపీ నేత శరద్​ పవార్​తో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీ సందర్భంగా 'ఎన్​సీపీని స్థాపించి 20 ఏళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాజకీయ ధీరుడికి, ఆధునిక చాణక్యుడిగా మీరు పిలుచుకునే వ్యక్తికి మధ్య ఆట మొదలైంది' అని భాజపా అధ్యక్షుడు అమిత్​షాను ఉద్దేశించి ఎన్​సీపీ అధికార ప్రతినిధి క్లైడ్​ క్రాస్టో ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని అంతకుముందు డిప్యూటీ సీఎం అజిత్​ పవార్ చేసిన పోస్ట్​కు సమాధానంగా పైవిధంగా స్పందించారు క్రాస్టో.

"అజిత్​ దాదా, మీరు ప్రధానమంత్రి శుభాకాంక్షలకు సమాధానమివ్వడాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మీ చేతులు పట్టుకుని నడిపించిన వారిని మోసం చేసినందుకే ఆ శుభాకాంక్షలు వచ్చాయి."

-క్రాస్టో ట్వీట్, ఎన్​సీపీ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా తాగునీరే కాలనాగుగా మారిన వేళ!

ABOUT THE AUTHOR

...view details