తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చుక్​ చుక్​ రైలు బండి ఇకపై నిశ్శబ్ద ప్రయాణం

ఈ ఏడాది చివర నుంచి రైళ్లు కూత పెట్టకుండా నిశ్శబ్దంగా నడుస్తాయని రైల్వే వ్యవస్థ తెలిపింది. పవర్​ కార్లకు బదులుగా విద్యుత్తు నుంచి వెలువడే శక్తితో నడపాలని అధికారులు వివరించారు. ఫలితంగా రైల్వే వ్యవస్థకు 800 కోట్లు ఆదాయం సమకూరుతుందని, వాటితోపాటు కాలుష్యాన్నీ నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

చుక్​ చుక్​ రైలు బండి ఇకపై నిశబ్ద ప్రయాణం

By

Published : Sep 18, 2019, 5:54 AM IST

Updated : Oct 1, 2019, 12:40 AM IST

ఈ ఏడాది చివరికల్లా దేశంలోని రైళ్లన్నీ నిశ్శబ్దంగా ప్రయాణించనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పవర్​ కార్లకు బదులు.. ఓవర్​హెడ్ విద్యుత్​ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించడమే ఇందుకు కారణం. పవర్​ కార్ల వల్ల శబ్ధ కాలుష్యం అధికంగా ఉంటోంది.

ఉన్న రెండు పవర్​కార్లలో ఒక దానికి ఎల్​ఎస్ఎల్​ఆర్​డీ అనుసంధానంతో భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన 6 సీట్లు, చైర్​ కారు ప్రయాణికుల కోసం అదనంగా 31 సీట్లను పొందుపరిచినట్లు అధికారులు వివరించారు.

ప్రస్తుతం ఉన్న పవర్​ కార్లు.. 105 డెసిబల్​ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. డిసెంబరులోపు ఈ శబ్దాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా రైల్వే వ్యవస్థకు విద్యుత్తు వినియోగంలో 800 కోట్ల ఆదాయం సమకూరుతుందని.. వాయు, శబ్ద కాలుష్యాన్నీ తగ్గించవచ్చన్నారు.

ఈ కొత్త వ్యవస్థను "హెడ్-ఆన్ జనరేషన్" (హెచ్​.ఓ.జీ) అంటారు. ప్రస్తుతం విద్యుత్తు వినియోగంలో యూనిట్​కు 36 రూపాయలకుపైగా ఖర్చవుతోంది. ఇదే యూనిట్​ హెచ్​ఓజీతో రూ.6కే లభిస్తుంది. ఇప్పటికే 342 రైళ్లను హెచ్​ఓజీగా మార్చేసింది రైల్వేశాఖ. ఈ ఏడాది చివరినాటికి మరో 284 రైళ్లను హెచ్​ఓజీ గా మార్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated : Oct 1, 2019, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details