తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 11మంది మృతి

acci
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Mar 14, 2020, 10:11 AM IST

Updated : Mar 14, 2020, 3:06 PM IST

09:59 March 14

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 11మంది మృతి

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​ జోధ్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలేసర్ తాలుకా షేర్​గఢ్​లోని సోయితరా వద్ద ఓ ట్రక్కు, వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న జిల్లా ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

వేగంగా వెళ్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొట్టిందని సమాచారం. ఈ కారణంగా  వ్యానులోని వారంతా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. వ్యానులో మృతులైనవారిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు అధికారులు.  

ఇదీ చూడండి:దేశంలో కొరవడిన మేలిమి విద్య.. తక్షణ పరిష్కారం అవసరం

Last Updated : Mar 14, 2020, 3:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details