తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2019, 5:56 AM IST

ETV Bharat / bharat

బంగా​ల్​ గవర్నర్​కు 'జెడ్​' భద్రత- ఆక్షేపించిన టీఎం​సీ

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు జెడ్​ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తృణమూల్​ కాంగ్రెస్ ఆక్షేపించింది. రాష్ట్రానికి చెడ్డపేరు తేవడానికి భాజపా యత్నిస్తుందని ఆరోపించింది.​

బంగా​ల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధంకర్​కు 'Z' కేటగిరి భద్రత

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్​కు​ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్​పీఎఫ్​​ బలగాలతో జెడ్​ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించినా దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన సాయుధ బృందం గవర్నర్​​ వెంట ఉండనుంది. త్వరలోనే భద్రతా బలగాలు ఆయన బాధ్యతను తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సహా పలువురు వీఐపీలకు సీఆర్​పీఎఫ్ జెడ్​ కేటగిరీ భద్రత ఉంది.

తృణమూల్​ ఆక్షేపణ...

గవర్నర్​కు​ జెడ్​ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించటంపై తృణమూల్​ కాంగ్రెస్ ఆక్షేపించింది. కాషాయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చటానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ గవర్నర్​కు భద్రత పరంగా ముప్పు వాటిల్లనప్పుడు... ప్రత్యేకంగా ఇప్పుడు భద్రత పెంచడం ఎందుకని ప్రశ్నించింది.

ఇదీ చూడండి : ప్రసంగం మధ్యలో సభకు తలవంచి మోదీ అభివాదం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details