ప్రస్తుత విద్యా సంవత్సరం 'జీరో ఇయర్'గా ముగియదని, పరీక్షలు జరుపుతామని పార్లమెంటరీ సంఘం ముందు కేంద్ర విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యాసంవత్సరం చివర్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసులు కూడా మూడో తరగతి దాటిన వారికి మాత్రమేనని, ఎనిమిదో తరగతి వరకు వాటి సంఖ్యను కూడా పరిమితం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు.. చరవాణులు, ల్యాప్‌ట్యాప్‌లు, కంపూటర్లు లేని బీద విద్యార్థుల సంగతేంటని ప్రశ్నించారు. వారికి విద్య ఎలా అందిస్తున్నారని అడిగారు. చరవాణులు కంటే కమ్యూనిటీ రేడియో, ట్రాన్సిస్టర్ ద్వారా విద్యా ప్రసారాలు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పార్లమెంటీ సంఘం ఛైర్మన్ వినయ్ సహస్రబుద్ధి అన్నారు.
కేంద్రం మల్లగుల్లాలు