ప్రతిఏటా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాస భారతీయ దినోత్సవ 16వ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పెర్సాద్ సంతోఖీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
నేడు 16వ ప్రవాస భారతీయ దివస్
16వ ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సును నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిచనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ విధానంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
16వ ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సు
'ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యం' అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు ప్లీనరీలుగా నిర్వహించే ఈ సదస్సు చివరిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఈ సదస్సు సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు విజేతల పేర్లను ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి:'టీకా పంపిణీతో మానవాళికి ప్రయోజనం కలగాలి'
Last Updated : Jan 9, 2021, 6:53 AM IST