తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​99 మాస్కుల వస్త్రాన్ని తయారుచేసిన 'అటిరా' - coronavirus death toll india

ఎన్99 మాస్కుల తయారీకి కావాలసిన వస్త్రాన్ని తయారుచేసింది అహ్మదాబాద్ వస్త్ర పరిశోధన సంఘం(అటిరా). డీఆర్​డీఓ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని రూపొందించింది. తాజాగా రూపొందించిన వస్త్రంతో ఐదు లక్షల మాస్కులను ఉత్పత్తి చేయవచ్చని పేర్కొంది. దేశంలో ఎన్-99 మాస్కుల తయారీలో తామే ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.

atira
ఎన్​99 మాస్కుల వస్త్రాన్ని తయారుచేసిన 'అటిరా'

By

Published : Apr 20, 2020, 10:22 PM IST

గుజరాత్​కు చెందిన అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమల పరిశోధన సంఘం(అటిరా) కరోనా కట్టడికి నడుం బిగించింది. 99 శాతం వైరస్​ను నియంత్రించగలిగే ఎన్​ 99 మాస్కుల తయారీకి కావలసిన వస్త్రాన్ని డీఆర్​డీఓ భాగస్వామ్యంలో తయారు చేసింది. 99 శాతం దుమ్ము, వైరస్ కణా​లను నియంత్రించగలిగిన ఈ మాస్క్​ దేశంలో అందుబాటులో ఉన్న మాస్కుల్లో అత్యుత్తమమైనది.

తాము అభివృద్ధి చేసిన వస్త్రంతో ఐదు లక్షల ఎన్99 మాస్కులను తయారు చేయవచ్చని తెలిపింది అటిరా. ఈ మాస్కులు ఎన్-95 రకం కంటే ఉత్తమమైనవని వెల్లడించింది. దేశంలో ఒక్క అహ్మదాబాద్ వస్త్ర పరిశోధనా సంఘంలోనే ఈ ఎన్99 మాస్కుల తయారీకి అవసరమైన ఏర్పాట్లు ఉన్నట్లు వెల్లడించింది.

"99 శాతం బయటి కాలుష్యాన్ని నియంత్రించగలిగిన మాస్కులు దేశంలో అందుబాటులో ఉన్న మాస్కుల్లో అత్యుత్తమమైనవి. దీని తయారీకి ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే మాకున్న సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తల కృషితో మాస్కులకు కావాలసిన వస్త్ర తయారీ పూర్తయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని రూపొందించాం."

-అటిరా ప్రతినిధి

ఎన్​99 మాస్కులకు ఐదు పొరలు ఉంటాయని..రెండు నానో మెష్​లు కలిగి ఉంటాయని వెల్లడించింది సంస్థ.

ఇదీ చూడండి:53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి​​

ABOUT THE AUTHOR

...view details