తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమేఠీ ప్రజలకు రాహుల్ నమ్మకద్రోహం: స్మృతి - లఖ్​నవూ

రాహుల్​ గాంధీ వయనాడ్​లో పోటీ చేయడమంటే అమేఠీ ప్రజలకు నమ్మకద్రోహం చేయటమేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అమేఠీ ప్రజల మద్దతుతోనే 15 ఏళ్ల పాటు రాహుల్ ఎంపీ పదవిని అనుభవించారని లఖ్​నవూ వేదికగా విమర్శలు చేశారు.

అమేఠీ ప్రజలకు రాహుల్ నమ్మకద్రోహం:స్మృతి

By

Published : Apr 4, 2019, 1:16 PM IST

రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ. అమేఠీని వీడి వయనాడ్​ వెళ్లి పోటీ చేయడం ప్రజల్ని వంచించటమేనన్నారు.

లఖ్​నవూలో పర్యటిస్తున్న స్మృతి.. అమేఠీ ప్రజల్ని రాహుల్ మోసగించారని ఆరోపించారు. ఇక్కడి ప్రజల మద్దతుతోనే 15 ఏళ్లపాటు ఎంపీ పదవిని అనుభవించి వేరే స్థానం నుంచి పోటీ చేయటం ఏంటని ప్రశ్నించారు.

"రాహుల్ గాంధీ వేరొక స్థానం నుంచి నామినేషన్ వేశారు. ఇది అమేఠీ ప్రజలకు అవమానం. అక్కడి ప్రజల్ని మోసగించడమే. ప్రజలు దీన్ని సహించబోరు."-స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

ఇదీ చూడండి:'పీఎం నరేంద్ర మోదీ'​పై 8న సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details