ఆధార్ ఆర్డినెన్స్-2019 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఉడాయ్‌ని న్యాయస్థానం ఆదేశించింది. వ్యాజ్యంలో ఆధార్ చెల్లుబాటుతో పాటు సవరణ చట్టం, క్రమబద్ధీకరణపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్లు.
2019 మార్చ్‌లో భారత గెజిట్‌లో ప్రచురితమైన ఈ ఆర్డినెన్స్‌పై విశ్రాంత సైన్యాధికారి ఎస్జీ వోంబట్కెరె, మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్, క్రమబద్ధీకరణ చట్టాలు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని ఆరోపించారు.
"ఆర్డినెన్స్‌తో ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఆధార్ వ్యవస్థ చేరుతోంది. తద్వారా వ్యక్తిగత, సున్నితమైన విషయాలతో వాణిజ్య దోపిడీకి అవకాశం ఉంది."
-వ్యాజ్యంలోని సారాంశం