సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగించి నిర్వహించిన లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇలాంటి పిటిషన్‌ను స్వీకరించలేమని కొట్టివేసింది.
న్యాయవాది ఎమ్ఎల్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. పిటిషన్ విచారణకు యోగ్యత లేనిదని పేర్కొంది. మీరు ఏమి అడుగుతున్నారో అర్థమవుతుందా.. మొత్తం లోక్‌సభ ఎన్నికలను పక్కన పెట్టాలని కోరుకుంటున్నారా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది ధర్మాసనం.