మహిళా భద్రత కోసం ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవలను నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. మహిళల భద్రతకు సంబంధించిన అంశంపై విచారణలో భాగంగా మోదీ సర్కారుకు ఈ సలహా ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.
అంతర్జాల ఆధారిత యాప్‌ల్లో మహిళలకు భద్రత లేదని... అందుకోసం ఎలాంటి నియంత్రణలు పాటించకుండా టాక్సీ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. ఇలాంటి టాక్సీల్లోనే అత్యాచార ఘటనలు ఎన్నో జరిగాయన్నారు.
మహిళా భద్రత విషయంలో సుప్రీంకోర్టుకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు జైసింగ్. వాహనాల్లో ఆడవారి భద్రతను రవాణాశాఖ పర్యవేక్షించడం లేదని కోర్టుకు తెలిపారు జైసింగ్.