తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1.40లక్షల రైల్వే పోస్టులకు డిసెంబర్​లో పరీక్షలు - Railway exams date

కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ ఈ ఏడాది చివర్లో ప్రారంభంకానుంది. డిసెంబరు 15 నుంచి మూడు విభాగాల్లో 1.40 లక్షల పోస్టులకు కంప్యూటర్​ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

Rlys to begin recruitment process for 1.40 lakh posts in three categories from Dec 15
డిసెంబరు 15 నుంచి రైల్వే పరీక్షలు!

By

Published : Sep 5, 2020, 8:38 PM IST

Updated : Sep 5, 2020, 8:46 PM IST

భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు.

రైల్వేలో భారీగా ఉద్యోగ నియామకాలకు రైల్వేశాఖ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అభ్యర్థులందరికీ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని వీకే యాదవ్‌ తెలిపారు. పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ, నీట్‌ పరీక్షలు జరుగుతుండటం వల్ల వాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వల్ల నిలిచిపోయిన ఈ పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.

రైల్వేశాఖ గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నాన్‌ టెక్నికల్‌ పాపులారిటీ కేటగిరీ (ఎన్‌టీపీసీ) కింద గార్డులు, ఆఫీస్‌ క్లర్క్‌లు, కమర్షియల్‌ క్లర్క్‌ల పోస్టులు 35,208 కాగా.. మినిస్టీరియల్‌ కేటగిరీ ఉద్యోగాలైన స్టెనో తదితర ఉద్యోగాలు 1663; అలాగే, ట్రాక్‌ నిర్వహణ, పాయింట్‌మెన్‌ వంటి ఉద్యోగాలు 1,03,769లను భర్తీ చేయనున్నారు

ఇదీ చూడండి:కర్ణాటకలో ఉగ్రరూపం: కొత్తగా 9,746 మందికి కరోనా

Last Updated : Sep 5, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details