పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లా బతాలా నగరంలో భయానక అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బాణసంచా కర్మాగారంలో పేలుడు ధాటికి 23 మంది మృతిచెందారు. 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్డీఆర్ఎఫ్)తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం(ఎస్డీఆర్ఎఫ్) ప్రమాదంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో చనిపోయిన వారంతా కార్మికులేనని అధికారులు తెలిపారు. రేపు జరిగే గురునానక్‌దేవ్ వివాహ మహోత్సవం కోసం బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి విచారం