తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: బెంగళూరు బరిలో ప్రకాశ్​ రాజ్​ - PRAKASH RAJ

ప్రముఖ నటుడు ప్రకాశ్​ రాజ్​ సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీకి దిగారు. బెంగళూరు సెంట్రల్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ సమర్పించారు.

లోక్​సభ బరిలో ప్రకాశ్​ రాజ్

By

Published : Mar 23, 2019, 8:18 AM IST

Updated : Mar 23, 2019, 10:33 AM IST

లోక్​సభ బరిలో ప్రకాశ్​ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​ కర్ణాటక నుంచి లోక్​సభ ఎన్నికల బరిలోకి దిగారు. శుక్రవారం బెంగళూరు సెంట్రల్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్​సభకు నామినేషన్​ సమర్పించారు. భాజపా అభ్యర్థి మోహన్​పై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ప్రకాశ్​ రాజ్​.

మోదీ పాలనపై ఇదివరకే ఎన్నో విమర్శలు చేశారు ప్రకాశ్​ రాజ్​. ఆయన​కు ఆమ్​ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది.

కర్ణాటకలో 28 నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్​ జరగనుంది. ప్రకాశ్​ రాజ్​ పోటీ చేస్తున్న స్థానానికి ఏప్రిల్​ 18న పోలింగ్ జరగనుంది.

Last Updated : Mar 23, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details