జపాన్ ఒసాకాలో ఈ నెల 27, 29 తేదీల్లో జరిగే జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
ప్రధానితో పాటు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
" జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. ఈ సదస్సులో ఆయన వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు."- రవీశ్‌కుమార్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి