జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి నిన్న రాత్రి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నిర్ణయం.. జమ్ముకశ్మీర్లో నూతనశకానికి నాందిగా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుతో శ్యామాప్రసాద్ ముఖర్జీ, అటల్‌బిహారీ వాజ్‌పేయీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా కోట్లాది మంది ఆకాంక్షలు సాకారమయ్యాయని చెప్పారు మోదీ. ఆర్టికల్ 370, 35-ఏతో కశ్మీరీలకు ఒనగూరిన ప్రయోజనాలేంటో వ్యతిరేకించేవారు చెప్పగలరా అని ప్రశ్నించారు.
"ఒక దేశంగా, ఒక కుటుంబంగా, మీరు, మేము మొత్తం దేశం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఒక వ్యవస్థ కారణంగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌కు చెందిన సోదర, సోదరీమణులు అనేక హక్కులు కోల్పోయారు. వారి అభివృద్ధికి అది అడ్డంకిగా నిలిచింది. మనందరి ప్రయత్నాల కారణంగా ఆ వ్యవస్థ దూరమైంది. సర్దార్ వల్లభాయ్‌పటేల్, బాబా సాహెబ్ అంబేడ్కర్, డాక్టర్ శ్యామ ప్రసాద్‌ముఖర్జీ, అటల్జీ సహా కోట్లాది మంది దేశ భక్తుల స్వప్నం ఇప్పుడు నేరవేరింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడు దేశంలో ప్రజలందరి హక్కులూ, బాధ్యతలూ సమానమే."
-నరేంద్ర మోదీ, ప్రధాని.
ఉగ్రవాదానికి చరమగీతం
ఇన్నాళ్లు అధికరణ 370ని అడ్డుపెట్టుకొని.. జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించిందని మండిపడ్డారు ప్రధాని. దీనితో కశ్మీరీ సామాన్యులకు ఏం ప్రయోజనం చేకూరిందని ప్రశ్నించారు. అవినీతి పెరిగి వారి బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. కుటుంబపాలనలో ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. గడిచిన 30 ఏళ్లలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా కశ్మీర్లో 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారన్నారని గుర్తు చేశారు మోదీ. వారిని భారత ప్రభుత్వం కీర్తిచక్ర, పరమవీరచక్ర, శౌర్య చక్ర పురస్కారాలతో సత్కరించిందని చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదం పూర్తిగా తొలిగిపోయి.. అభివృద్ది పథంలో అడుగులు వేసిన వెంటనే కేంద్రపాలిత ప్రాంతం నుంచి పూర్తి స్థాయి రాష్ట్రంగా మళ్లీ మారుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పథంలో ముందుకు