తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా కూటమితో దేశ భద్రతకు ముప్పు' - up

మహా కూటమిపై మరోమారు విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... కూటమికి అధికారమివ్వద్దని ఓటర్లను అభ్యర్థించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : May 11, 2019, 5:09 PM IST

కేంద్రంలో మహాకూటమి ప్రభుత్వం వస్తే దేశ భద్రత క్షీణిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి ఓటు వేయొద్దని ప్రజలను అభ్యర్థించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. పోఖ్రాన్​ అణు పరీక్షలు జరిపి నేటితో 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ సేవలను కీర్తించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"21 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత్​ పరమాణు పరీక్షలు జరిపింది. ఆపరేషన్​ శక్తిని విజయవంతంగా పూర్తి చేశాం. 1998లో జరిగిన ఈ ఘటన బలమైన ప్రభుత్వం దేశ రక్షణకు ఎలా కృషి చేస్తుందో రుజువు చేసింది. ఈ సామర్థ్యం భారత్​కు ఎప్పటినుంచే ఉన్నా ప్రయోగించలేదు. భాజపా కన్నా ముందు ఉన్న ప్రభుత్వంలో అంత దమ్ము లేదు. ఆ విధంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: 'మోదీ సిద్ధాంతం విభజించి.. పాలించడం'

ABOUT THE AUTHOR

...view details