తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్త్రీ-పురుషులకు ఒకే పెళ్లి వయసు పరిమితుండాలి' - సమానత్వం

మహిళలు, పురుషులకు వివాహం చేసుకునేందుకు కనిష్ఠ చట్టపరమైన వయస్సు ఒకటే ఉండాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లుగా వివాహ వయస్సు నిర్ణయించడం ముమ్మాటికీ వివక్షేనని పిటిషన్​లో​ పేర్కొన్నారు.

'పెళ్లి వయస్సులోనూ సమానత్వం కావాలి'

By

Published : Aug 14, 2019, 5:50 PM IST

Updated : Sep 27, 2019, 12:25 AM IST

మహిళలకు చట్టపరంగా కనిష్ఠ వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మహిళలపై చూపుతున్న వివక్షను రూపుమాపాలని పిటిషన్​లో పేర్కొన్నారు. భాజపా నాయకుడు, న్యాయవాది అశ్వినీ కుమార్​ ఉపాధ్యాయ్​ ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

"మహిళలకు, పురుషులకు వివాహ వయస్సు సమానంగా ఉండాలి. మహిళలకు 18, పురుషులకు 21గా పరిమితులు పెట్టడంలో పాతకాలపు విధానాలే ఉన్నాయి. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. మారుతున్న ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వివక్షను రూపుమాపాలి. ఇది లింగ సమానత్వం, లింగ న్యాయం, మహిళల గౌరవానికి భంగం కలిగించేదిగా ఉంది."
- పిటిషన్​ సారాంశం

ఇదీ చూడండి: స్వచ్ఛతలో మీ పల్లెకు ఎంత స్కోర్​ ఇస్తారు?

Last Updated : Sep 27, 2019, 12:25 AM IST

ABOUT THE AUTHOR

...view details