తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పుల్వామా 2.0'పై భారత్​కు పాక్​ హెచ్చరిక

జమ్ముకశ్మీర్​లో మరోసారి పుల్వామా తరహా దాడులు జరపడానికి ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారని భారత్​కు సమాచారం అందించింది పాకిస్థాన్. అప్రమత్తమైన ప్రభుత్వం కశ్మీర్​లో హైఅలర్ట్ ప్రకటించింది.

మరోసారి పుల్వామా తరహా దాడి... భారత్​కు పాక్ సమాచారం

By

Published : Jun 17, 2019, 6:16 AM IST

Updated : Jun 17, 2019, 7:23 AM IST

జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రదాడికి అవకాశం ఉందని పాకిస్థాన్​ నిఘా వర్గాలు భారత్​ను అప్రమత్తం చేశాయి. స్పందించిన ప్రభుత్వం కశ్మీర్​వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ నిఘా సమాచారాన్ని పాక్​ అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకూ తెలిపింది పాకిస్థాన్​.

పుల్వామాలో పాక్​ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. అదే రీతిలో అవంతిపొరలో దాడికి యత్నించవచ్చని పాక్​ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత నెల 24న పుల్వామా జిల్లాలో ఆల్​ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాద ముఠా అన్సార్ గజావత్​ ఉల్​ హింద్ కమాండర్​ జకీర్​ మూసాను భద్రతా దళాలు కాల్చిచంపాయి. ఇందుకు ప్రతీకారంగా విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నాయన్నది పాక్ నిఘా వర్గాల సమాచారం. అయితే దాడికి సంబంధించి కచ్చితమైన వివరాలు పాక్ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?

Last Updated : Jun 17, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details