తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటరు​ స్లిప్పు సరిపోదు

ఓటేయటానికి ఓటర్​ స్లిప్​ మాత్రమే గుర్తింపు కార్డుగా సరిపోదని ఎన్నికల సంఘం తెలిపింది. వేరే గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపింది.

ఓటరు​ స్లిప్పు సరిపోదు

By

Published : Mar 1, 2019, 7:21 AM IST

ఓటేయటానికి ఓటరు స్లిప్పు​ మాత్రమే సరిపోదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఆధార్​, పాస్​పోర్టు ​కార్డు సహా 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని తప్పకుండా వెంట తీసుకెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.

ఓటరు​ స్లిప్పు సరిపోదు

ఓటరు స్లిప్పు గుర్తింపుగా పని చేయదని చెప్పింది. ఓటర్​ స్లిప్పులలో భద్రతా సదుపాయాలు లేవనే అభ్యంతరాలు రావడం వల్ల ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం 99 శాతం ఓటర్లు... ఓటరు​ గుర్తింపు కార్డులను కలిగిఉన్నారు. 18 ఏళ్ల దాటిన వారిలో 99 శాతం కంటే ఎక్కువ మందికి ఆధార్​ కార్డులున్నాయి.

12 కార్డులివే

ఈసీ గుర్తింపు కార్డులుగా ఆమోదించిన వాటిలో ... ఓటర్​ గుర్తింపు కార్డు, పాస్​పోర్టు, ఆధార్​ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్​బుక్​, పాన్​ కార్డు తదితరాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details