జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ఓ ట్వీట్‌కు విశేష స్పందన లభించింది. ఆయన పోస్ట్‌కు ఒక గంట వ్యవధిలోనే 52వేల మంది లైక్ కొట్టారు. 8వేల మంది రీట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధంలోకి వెళ్లిన అబ్దుల్లా మంగళవారమే విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫోటోతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆ ట్వీట్‌కు గంటలో 52వేల లైక్‌లు నిర్బంధంలో ఎలా ఉండాలో చెబుతా..
హరి నివాస్ ప్యాలస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గడ్డంతో ఉన్న తన చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు అబ్దుల్లా. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో నిర్బంధ సమయంలో ఎలా ఉండాలో చిట్కాలు కావాలంటే చేబుతానని.. తనకు ఎనిమిది నెలల అనుభవం ఉందని పేర్కొన్నారు ఒమర్.
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అంతర్జాలం సేవలుపరిమితంగా ఉన్నప్పటికి లైక్‌ల సంఖ్య పెరగడం గమనార్హం.
ఇదీ చూడండి:భారత్ లాక్డౌన్: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే