అసోం జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) భాజపాకి గుణపాఠం నేర్పిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జాబితా సరిగా ఉంటే అసోం భాజపా నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని ప్రశ్నించారు.
"అసోంలో 40 లక్షల మంది విదేశీయులు ఉన్నారని అమిత్ షా గతంలో చెప్పారు. ఆయన ఈ మాట మీద నిలబడతారా? వాళ్లు చెప్పిన కల్పిత పురాణం బయటపడింది. అందుకే అసోంలోని భాజపానే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఫారెన్ ట్రైబ్యునల్ న్యాయంగా పనిచేస్తే ఈ సంఖ్య ఇంకా తగ్గుతుంది. అసోంలోని కొంతమందితో మాట్లాడాను. తల్లితండ్రుల పేర్లు జాబితాలో ఉండి వారి కుమారుల పేర్లు గల్లంతయ్యాయి."