అంగారకుని పైకి వెళ్లేందుకు తలపెట్టిన మార్స్ 2020 మిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు నాసా ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చిప్‌లో అంగారకుని పైకి తీసుకెళ్తామని నాసా పేర్కొంది. దీంతో చాలా మంది ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర పుణెలోని ఓ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఏకంగా 13 మంది పేర్లు ఇందుకు ఎంపికయ్యాయి. ఒకే పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులతో పాటు ఏడుగురు ఉపాద్యాయుల పేర్లు ఎన్నికవ్వడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
"మార్స్ మిషన్ 2020 కోసం పేర్లు నమోదు చేసుకోమని నాసా ఇచ్చిన పిలుపునకు స్పందించాం. స్కూల్ తరఫున కొన్ని పేర్లు పంపించాం. నాసా మా పేర్లు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు."
-నాగ్ నాథ్ విభూతే, ఉపాధ్యాయుడు
"నేను శాస్త్రవేత్తను అయ్యి.. నాసాలో ఉద్యోగం చేయడం నా కల. ఇప్పుడు వారే మా పేర్లను మార్స్ కోసం ఎంపిక చేశారు. నా కల నిజమయ్యేందుకు నాసాతో ఈ బంధం ఏర్పడిందనుకుంటున్నాను."