మధ్యప్రదేశ్ శాసనసభ నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల 26 వరకూ వాయిదాపడింది. ఇవాళ విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేవలం ఒక్క నిమిషంలోనే ప్రసంగాన్ని పూర్తి చేసి సభను వీడారు టాండన్. అనంతరం ఈ నెల 26వరకు సభను వాయిదావేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బలపరీక్ష నిర్వహించాలని భాజపా సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించినా పట్టించుకోలేదు.