జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత.. ఉగ్రవాద ముఠాల్లో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 ఆగస్టు 5 నుంచి 2020 జనవరి 26 వరకు జమ్ముకశ్మీర్ నుంచి కేవలం 28 మంది యువత మాత్రమే ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపినట్లు భద్రతా విభాగం.. ఓ అంతర్గత నివేదికలో పేర్కొంది.
గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉగ్రవాదం వైపు అడుగులు వేసిన యువత సంఖ్య కంటే ఇది 60 శాతం తక్కువ. ఆ సమయంలో ఎక్కువగా పుల్వామా, అనంత్‌నాగ్, కుల్‌గావ్, షోపియాన్ జిల్లాలకు చెందిన 105 మంది యువత ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపారు. 2018తో పోలిస్తే... 2019లో ఆ సంఖ్య 35 శాతం తగ్గినట్లు భద్రతా విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.