ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విడుదల చేసిన.. 2020 నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారత్.. 131వ స్థానానికి పడిపోయింది. మెుత్తం 189 దేశాలతో కూడీన నివేదికను విడుదల చేసిన యూన్‌డీపీ. ఈ ఏడాది భారత్ గతంలో కంటే.. ఒకస్థానం దిగజారినట్లు పేర్కొంది.
మానవ అభివృద్ధి సూచీలో ఒక దేశం ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల కొలత ఆధారంగా యూన్‌డీపీ ప్రతిఏటా నివేదికను విడుదల చేస్తుంది. 2019 లో భారతీయుల ఆయుర్దాయం 69.7 సంవత్సరాలు కాగా, బంగ్లాదేశ్‌లో ఆయుర్దాయం 72.6 సంవత్సరాలు, పాకిస్తాన్‌లో 67.3 సంవత్సరాలు ఉన్నట్లు 2020 మానవ అభివృద్ధి నివేదిక తెలిపింది.